మంగళగిరి పీఎస్లో తెదేపా నేతల బైఠాయింపు గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనంపై దాడి కేసులో అరెస్టైన రైతు రామ్మోహన్రావును పరామర్శించేందుకు తెదేపా నేతలు మంగళగిరి పోలీసు స్టేషన్కు వెళ్లారు. రామ్మోహన్రావుకు సంఘీభావం తెలిపేందుకు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అక్కడికి వెళ్లారు. రామ్మోహన్ రావు ఎక్కడ ఉన్నారని పోలీసులను ప్రశ్నించారు. రైతును చూపించే వరకూ స్టేషన్ వదిలి వెళ్లబోమని బైఠాయించారు. రైతు నల్లపాడు పోలీసు స్టేషన్లో ఉన్నారన్న సమాచారంతో నేతలు అక్కడికి వెళ్లారు.
ఇదీ చదవండి:
ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి చేసిన రైతులపై కేసులు