ETV Bharat / state

TDP leaders on Chandrababu journey Jail to Home: "హైకోర్టు నిబంధనలకు లోబడే చంద్రబాబు ప్రయాణం.. చంద్రబాబు ఎక్కడా వాహనం దిగలేదు" - చంద్రబాబుకు బెయిల్​

TDP leaders on Chandrababu journey Jail to Home: మధ్యంతర బెయిల్​ మంజూరుతో.. టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టు నిబంధనలకు లోబడే.. ప్రవర్తించారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.

tdp_leaders_on_chandrababu_journey_jail_to_home

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 1, 2023, 12:08 PM IST

TDP leaders on Chandrababu journey Jail to Home: హైకోర్టు నిబంధనలకు లోబడే రాజమండ్రి నుంచి ఆయన నివాసానికి చంద్రబాబు చేరుకున్నారని.. తెలుగుదేశం నేతలు స్పష్టం చేశారు. ఎక్కడ కూడా చంద్రబాబు రాజకీయ యాత్ర చేపట్టలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. విజయవాడ సీపీకి సందేశం పంపారు. వేలాదిగా ప్రజలు వచ్చిన కూడా ఎక్కడా చంద్రబాబు వాహనం దిగలేదని స్పష్టం చేశారు.

కోర్టు నిబంధనలకు లోబడి ప్రయాణిస్తున్నందున తన వాహనశ్రేణి వెంబడి ఎలాంటి వాహనాలు అనుమతించవద్దని.. సీఐ రాజుకు చంద్రబాబు చెప్పిన విషయాన్ని సీపీకి వివరించారు. ఇదే విషయాన్ని తన ప్రయాణం పర్యవేక్షిస్తున్న డీసీపీకి తెలపాలని చంద్రబాబు కోరినట్లు పేర్కొన్నారు. వైసీపీ నేతలు అనవసర విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.

Chandrababu Reached Home at Undavalli: ఉదయం 6 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న చంద్రబాబు..

విజయవాడ సీపీకి అచ్చెన్న సందేశం: చంద్రబాబు ప్రయాణం ఆలస్యంపై విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాకు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సందేశం పంపారు. కోర్టు నిబంధనలకు లోబడే చంద్రబాబు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని వివరించారు. చంద్రబాబు ఎక్కడా రాజకీయ యాత్ర చేపట్టలేదని స్పష్టం చేశారు. వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన కుడా చంద్రబాబు ఎక్కడా వాహనం దిగలేదనే విషయాన్ని నొక్కి చెప్పారు. టీడీపీ శ్రేణులు సంయమనం పాటించాలని.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా.. మంగళవారం సాయంత్రమే పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు.

చంద్రబాబుకు హైకోర్టు షరతులు: చంద్రబాబుకు మధ్యంతర బెయిల్​ మంజూరు చేసిన హైకోర్టు.. చంద్రబాబుకు కొన్ని షరతులు విధించింది. చంద్రబాబు ఎటువంటి ర్యాలీల్లో పాల్గొనవద్దని నిబంధన విధించింది. అంతేకాకుండా మీడియాతో కూడా మాట్లాడవద్దని ఆదేశించింది. హైకోర్టు నిబంధనల మేరకే చంద్రబాబు ప్రయాణంలో కాన్వాయ్​ దిగకుండా అందులోనే ఉండిపోయారు. ఇంకా ఇతర అంశాలపై హైకోర్టు బుధవారం విచారణ జరపనుంది.

Chandrababu Release TDP Workers Celebrations: జైలు గది నుంచి.. జనం గుండెల్లోకి చంద్రబాబు.. కట్టలు తెంచుకున్న అభిమానం.. ముందుగానే దీపావళి వేడుకలు

వాహనాలను అడ్డుకున్న పోలీసులు: చంద్రబాబుకు హైకోర్టు షరతులు విధించడంతో.. ఆ నిబంధనలకు లోబడే ఆయన రాజమహేంద్రవరం నుంచి బయల్దేరారు. ఈ క్రమంలో తన కాన్వాయ్​ వెంట ఇతర ప్రైవేట్​ వాహనాలకు అనుమతి వద్దని చంద్రబాబు పోలీసులకు తెలిపారు. రాజమండ్రిలోని దివాన్​ చెరువు మీదుగా వేమగిరి వైపు చంద్రబాబు కాన్వాయ్​ బయల్దేరగా.. ఆయన కాన్వాయ్​ వెంట కొన్ని వాహనాలు అనుసరించాయి. దీంతో ఈ వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దివాన్​ చెరువు వద్దే వాహనాలను పోలీసులు నిలిపివేశారు. అటువైపు వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.

టీడీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు: చిలకలూరిపేటలో టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలపై టీడీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. దీంతో పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ.. కార్యకర్తలను స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పోలీస్​ స్టేషన్​ను ముట్టడించగా.. పోలీసులు కార్యకర్తలను విడుదల చేశారు.

Chandrababu Followers Highly Crowd on Roads: జనసంద్రమైన రోడ్లు.. ఉప్పొంగిన అభిమానం.. ఎక్కడ చూసినా సంబరాలే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.