ETV Bharat / state

TDP Leaders and Activists Protests: పట్టు వదలని టీడీపీ నేతలు.. శిబిరాల్లోనే వినాయకుడి పూజలు

TDP Leaders and Activists Protests: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో నిరసనలు, నిరాహార దీక్షలు అంతకంతకూ ఉద్ధృతమవుతున్నాయి. వినాయకచవితి రోజునా వెనక్కి తగ్గని తెలుగుదేశం నాయకులు, అభిమానులు.. నిరసనలు కొనసాగించారు. దీక్షా శిబిరాల్లోనే వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు త్వరలోనే క్షేమంగా జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులకు మనోనిబ్బరాన్నివ్వాలని గణనాథున్ని కోరారు.

tdp_leaders_protests
tdp_leaders_protests
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 18, 2023, 8:16 PM IST

Updated : Sep 18, 2023, 10:25 PM IST

TDP Leaders and Activists Protests: పట్టు వదలని టీడీపీ నేతలు.. శిబిరాల్లోనే వినాయకుడి పూజలు

TDP Leaders and Activists Protest Across the State: స్కిల్‌ డెవలప్మెంట్(Skill Development Case) కేసులో అవినీతి ఆరోపణలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్టు చేయడంపై నిరసనలు మిన్నంటుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు రిలే నిరాహార దీక్షలను ఉద్ధృతం చేశారు.

Rajamahendravaram.. వినాయకచవితి సందర్భంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. రాజమహేంద్రవరం నాలాం భీమరాజు వీధిలోని శ్రీసిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె వెంట బ్రాహ్మణి, బాలకృష్ణ సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం భువనేశ్వరి విద్యానగర్‌లోని దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిరసన కొనసాగించారు.

Krishna District.. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు శివాలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి తెలుగుదేశం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. నందిగామ రైతులు చేపట్టిన వినాయక చవితి పూజలో తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు.

Statewide Protests Against Chandrababu Arrest బాబు అరెస్టుపై కొనసాగుతున్న నిరసనల వెల్లువ.. ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు..

NTR District.. చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వాలన్న ఆకాంక్షతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరో రోజు కొనసాగాయి. మాజీ మంత్రి దేవినేని ఉమ దీక్షల్లో పాల్గొన్నారు. దీక్షాశిబిరం వద్ద ఏర్పాటుచేసిన గణనాథుని విగ్రహానికి పూజలు చేశారు.

Guntur District.. ప్రభుత్వ కుట్రల్ని ఛేదించుకొని చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని కాంక్షిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజధాని రైతులు, తెలుగుదేశం నేతలు దీక్షలు కొనసాగించారు. దీక్షా శిబిరంలోనే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. తుళ్లూరు మండలం మందడంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాడికొండలో తెలుగుదేశం నాయకులు వినాయకచవితి పండుగను పక్కనపెట్టి నిరసనలు కొనసాగించారు . చంద్రబాబు విడుదల ఆలస్యమయ్యే కొద్దీ నిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Bapatla District.. బాపట్ల జిల్లా అద్దంకిలో రిలే నిరాహార దీక్షల్లో ముస్లింలు, తెలుగుదేశం శ్రేణులు పాల్గొని నిరసనలు కొనసాగించారు. బాబుతో మేముసైతం అంటూ నినాదాలు చేశారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులూ దీక్షలకు సంఘీభావం తెలిపారు. చీరాలలోని తెలుగుదేశం కార్యాలయం వద్ద ఆరో రోజూ రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.

Chandrababu Followers Rally in LB Nagar : 'చంద్రబాబును విడుదల చేసేంత వరకు నిరసనలు కొనసాగుతాయి'

Kurnool District.. చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం నాయకులు కర్నూలు ధర్నాచౌక్‌ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ముస్లిం మైనార్టీలు దీక్షలకు మద్దతు తెలిపారు. యువత, వృద్ధులు 101 టెంకాయలు కొట్టి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

Anantapur District.. స్కిల్‌ డెవలెప్మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని సీమెన్స్‌ సంస్థ అధికారులే చెబుతున్నా సీఎం జగన్‌కు అర్థం కావడం లేదని అనంతపురం తెలుగుదేశం నాయకులు ఆక్షేపించారు. చంద్రబాబు అరెస్టును తప్పుపడుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ముస్లిం మైనార్టీలు ఆందోళన చేపట్టారు.

YSR District.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో తెలుగుదేశం తలపెట్టిన దీక్షలకు ముస్లింలు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యేవరకు దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Tirupati District.. చంద్రబాబు స్వగ్రామం తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని ఆయన నివాసం వద్ద గ్రామస్థులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ వినాయకచవితి పండుగను తాము జరుపుకోవడం లేదని గ్రామస్థులు తెలిపారు.

Telugu People Protest Against CBN Arrest in America చంద్రబాబు ఆరెస్టుపై అగ్రరాజ్యంలో ఆందోళనలు.. డల్లాస్, వాషింగ్టన్ పురవీధుల్లో తెలుగు ప్రజల ర్యాలీలు

Nellore District.. నెల్లూరు జిల్లా మర్రిపాడులోని తన నివాసంలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి 37 వేల లడ్డూలతో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు.

East Godavari District.. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో చేపట్టిన సామూహిక నిరాహార దీక్షలు ఏడో రోజు కొనసాగాయి. వినాయకచవితిని పురస్కరించుకుని.. దీక్షా శిబిరం వద్ద గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. సామూహిక దీక్షల్లో ముస్లింలు, క్రైస్తవులు పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.

Dr. B.R. Ambedkar Konaseema District.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు చంద్రబాబు త్వరలోనే జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో వినాయకుడికి పూజలు చేశారు.

Telugu People Protest in Bengaluru Against Chandrababu Arrest: బెంగళూరులో కదం తొక్కిన ఐటీ ఉద్యోగులు.. రెండోరోజూ ఆగని నిరసనలు

West Godavari District.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల నిరసన దీక్షలు కొనసాగాయి. పాలకొల్లు గాంధీబొమ్మ కూడలిలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదో రోజు కొనసాగాయి.

Anakapalli District.. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నలపాలెంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో గణేష్‌ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్రమ కేసులతో చంద్రబాబును అరెస్టు చేసిన ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని గణేశుడికి ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ పాయకరావుపేటలో ఆటోడ్రైవర్లు వినాయక పందిళ్ల వద్ద పూజలు చేశారు.

Vizianagaram District.. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ విజయనగరం జిల్లావ్యాప్తంగా ఆరో రోజు దీక్షలు కొనసాగాయి. విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ముస్లిం, మైనార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. విజయనగరం సిటీ బస్టాండ్‌ వద్ద ఉన్న వరసిద్ధి వినాయక ఆలయంలో.. కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Last Updated : Sep 18, 2023, 10:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.