ETV Bharat / state

నీళ్లతో రాజకీయం పండించే మేధావి జగన్ - రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు : టీడీపీ - నాగార్జున సాగర్ ఇష్యూపై నక్కా ఆనంద్ బాబు

TDP Leaders about Nagarjuna Sagar Issue: నాలుగున్నరేళ్లు మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు పోలీసులతో నాగార్జున సాగర్​పై దండయాత్ర చేయడం ఏంటని టీడీపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ రెడ్డి ఓటమి ఖాయమని అన్నారు.

TDP_Devineni_Uma_On_Nagarjuna_Sagar_Issue

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 6:55 PM IST

TDP Leaders about Nagarjuna Sagar Issue: నాగార్జున సాగర్ విషయంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దొంగ, నేరస్తుడు ముఖ్యమంత్రి అయితే పోలీస్ యంత్రాంగం ముద్దాయిగా మారుతుందనడానికి నాగార్జున సాగర్ వివాదమే నిదర్శనమని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.

మంత్రి రాంబాబు స్వామి మాలలో ఉండి ఇంగితం లేకుండా అబద్ధాలు చెబుతూ మీసాలు తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భావోద్వేగాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తే జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యుడని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టామో, ఎన్ని పూర్తిచేసి లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామో ధైర్యంగా చెప్పగలమన్నారు.

54 నెలల్లో జగన్ రెడ్డి ఇరిగేషన్ రంగానికి ఏం వెలగబెట్టాడో చెబుతూ, వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేయగలడా అంటూ దేవినేని ప్రశ్నించారు. జగన్ రెడ్డి అసమర్థత, చేతగానితనం వల్లే శ్రీశైలం డ్యామ్ నుంచి పక్క రాష్ట్రం నీళ్లు తరలించుకుపోయిందని మండిపడ్డారు. శ్రీశైలం నుంచి నీళ్లు దొంగిలిస్తున్నా రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా నోరెత్తని జగన్ రెడ్డి రాయలసీమ ద్రోహి కాడా అని నిలదీశారు.

నాగార్జున సాగర్‌ డ్యాం వద్ద మళ్లీ టెన్షన్​ - భారీగా పోలీసుల మోహరింపు

Nakka Anand Babu On Nagarjuna Sagar Issue: నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు పెట్టి కేసీఆర్​తో అంటకాగిన జగన్ ఇప్పుడు సాగర్ జలాల విషయంలో కొత్త డ్రామాకు తెర లేపారని మాజీమంత్రి నక్కా ఆనంద బాబు విమర్శించారు. గుంటూరులో శ్రీ వికాస్ విద్యా సంస్థల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

గత ఎన్నికల్లో జగన్​కు కేసీఆర్ ఆర్థిక సాయం చేసినందుకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. తెలంగాణలో పోలింగ్ మొదలయ్యే సమయానికి డ్రామా మొదలుపెట్టి కేసీఆర్‍కు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు యత్నించారని మండిపడ్డారు. జగన్ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జగన్ రెడ్డి అధికారం పోగానే జైలుకు పోతాడని హెచ్చరించారు.

సాగర్ వార్ - ఇరు రాష్ట్రాల ఖాకీల పహారాతో టెన్షన్ టెన్షన్ - ఏపీ పోలీసులపై కేసు నమోదు

GV Anjaneyulu Fires on CM Jagan: సాగర్ కుడి కాల్వ, ఎడమ కాల్వకు తేడా తెలియని మంత్రులు ఉన్నారని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. పంటలు పండించే నీళ్లతో రాజకీయ పంట పండించే మేధావి జగన్ అని జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. అసలు నీళ్లే లేనిచోట వివాదాలా అని ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లుగా ఆగి ఇప్పుడు నీటి వివాదాన్ని రెచ్చగొడుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై, జగన్ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.

డెల్టాకు నీరు ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తున్నా జగన్‌ పట్టించుకోలేదని జీవీ ఆంజనేయుడు ధ్వజమెత్తారు. తెలంగాణ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పోలీసులతో దండయాత్ర చేయించడమేంటో జగనే చెప్పాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.