ETV Bharat / state

సభాపతి ఇవన్నీ తెలుసుకోవాలి- యనమల రామకృష్ణుడు

రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేస్తే.. న్యాయస్థానాలు కలగజేసుకుంటాయని యనమల రామకృష్ణుడు అన్నారు. చట్టసభల చర్చలు, నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం ఉండకూడదన్న స్పీకర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. పదవ షెడ్యూల్ ప్రొసీడింగ్స్​తో సభ అనుసంధానించి ఉందని గుర్తు చేశారు.

yanamala ramakrishundu on speaker
యనమల రామకృష్ణుడు
author img

By

Published : Aug 8, 2020, 1:30 PM IST

చట్టసభల్లో చర్చలు, నిర్ణయాల్లో న్యాయస్థానాల జోక్యం ఉండకూడదని సభాపతి చేసిన వ్యాఖ్యలపై.. తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. చట్టవిరుద్ధం అయితే, సభ నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోగలవన్నది స్పీకర్ గుర్తించాలని.. హితువు పలికారు. రాజ్యాంగానికి విరుద్ధంగా సభ ఏదైనా చట్టం చేస్తే.. న్యాయస్థానం ప్రశ్నించవచ్చని అన్నారు. పదవ షెడ్యూల్ ప్రొసీడింగ్స్ సభతో అనుసంధానించి ఉన్నాయని గుర్తుచేశారు. సభాపతి నిర్ణయం, సభ లోపల తీసుకునేదానికీ.. వెలుపల మాట్లాడే వాటికి భిన్నంగా ఉందని ఆరోపించారు. సెలక్ట్ కమిటీలో పెండింగ్ ఉన్న బిల్లులను.. ప్రభుత్వం రెండవ సారి సభ ముందుకు ఎలా తీసుకువచ్చిందని ప్రశ్నించారు. అందువల్లే తమ ఎమ్మెల్సీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని స్పష్టం చేశారు. సమస్య కోర్టులో పెండింగ్ ఉందనీ.. రెండు బిల్లులకు సంబంధించిన శాసన ప్రక్రియ ఇంకా పూర్తి కావాల్సి ఉందని, ఇవన్నీ గౌరవ సభాపతి తెలుసుకోవాలని యనమల హితువు పలికారు.

ఇదీ చదవండి: సీఆర్డీఏపై హైకోర్టు స్టే వెకేట్​ చేయాలని సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.