రాష్ట్రంలో వైకాపా హయాంలో పాలెగాళ్ల పాలన నడుస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. గుంటూరు జిల్లాలోని పల్నాడులో నాయక్ కుటుంబంపై జరిగిన దాడే దీనికి నిదర్శనమన్నారు. మాచర్ల ప్రాంతంలో పోలీసులు, రౌడీలు ములాఖత్ అయ్యారని ఆరోపించారు. సరస్వతీ పవర్ భూములను రైతులు సాగు చేసుకుంటుంటే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రౌడీలను పంపారని... దీనికి అడ్డం తిరిగిన యలమంద నాయక్‌ను అన్యాయంగా జైలుకి పంపారని విమర్శించారు.
ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాయటంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేవరకు తెదేపా అండగా ఉంటుందని తెలిపారు. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
వైకాపా నేతల పంపకాల్లో భాగంగానే ఫ్యుజన్ ఫుడ్స్ ఖాళీ: అచ్చెన్నాయుడు