గుంటూరు జిల్లా వెలగపూడిలో జరిగిన ఘటనకు హోంమంత్రి సుచరిత, ఎంపీ నందిగం సురేష్ బాధ్యత వహించి.. తక్షణమే రాజీనామా చేయాలని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యారావు డిమాండ్ చేశారు. దళితల మధ్య చిచ్చు పెట్టడానికే ఇలాంటి ఘర్షణలు లెవనెత్తున్నారన్నారు. రెండు వర్గాల వారి మధ్య ఘర్షణ జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారే తప్ప వారిని అపలేదన్నారు. హోంమంత్రి సుచరిత ఆదేశాల మేరకే పోలీసులకు ఆ రకంగా నడుచుకున్నారన్నారు. ఎంపీ నందిగం సురేష్.. ఈ ఘర్షణకు కారణమని బాధితులు చెబుతుంటే.. అతని మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
అమరావతిలో మహిళలపైన పోలీసులు లాఠీ ఛార్జి చేస్తే.. హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కులాలు, మతాలు మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దళితుల మధ్య తెదేపా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందని ఓ పత్రిక రాయడాన్ని ఖండించామన్నారు.
ఇదీ చదవండి: