వైకాపా ప్రభుత్వం కరపత్ర ప్రచారాన్ని మానుకొవాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి నసీర్ అహమ్మద్ అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ గుంటూరు లాంచెస్టర్ రోడ్డులోని సచివాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. వీరిని పోలీసులు అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కి తరలించారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించే ఇళ్లను వైకాపా ప్రభుత్వం.. ప్రచారానికి వాడుకుంటోందని ఆరోపించారు.
వార్డు సచివాలయంలో ఒక ఫోరంను ఏర్పాటు చేసి తెదేపా, వైకాపా ప్రభుత్వాలు కట్టిన గృహాల్లో... దేనిని ఎంచుకుంటారని ప్రశ్నించటం... విద్వేషాలను రెచ్చగొట్టటమేనని ఆరోపించారు. అర్హులైన ప్రతిఒక్కరకి గృహాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: