TDP Leader Nakka Anand Babu on YCP Sand Scam: రాష్ట్రంలో జరుగుతున్న ఇసుకు కుంభకోణంలో జగన్ వాటా 50 వేల కోట్లు అయితే.. వెంకటరెడ్డి వాటా ఎంత అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. అలానే ప్రతీ చోటా ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నది వైసీపీ నాయకులే అని అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా అందినకాడికి దోచుకుంటున్నారని మండిపడ్డారు. దొంగ వే బిల్స్‌తో రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారంటూ ఆధారాలను బయటపెట్టారు. కలకత్తా నుంచి రహస్యంగా నడిపిన ఇసుక టెండర్ల విధానం మరో పెద్ద కుంభకోణమని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టి మరీ వేల కోట్లు ఇసుక ద్వారా దోచుకున్నారని మండిపడ్డారు. ఇసుక కుంభకోణం డబ్బుతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని జగన్ చూస్తున్నాడని నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.
టెండర్లు ఖరారు కాకుండానే ఇసుక తవ్వకాలు - టెండర్ పెట్టింది సీఎంవోనా?
ప్రతీ ఇసుక అక్రమ తవ్వకంలో ప్రధాన వాటాదారు ఏపీఎండీసీ వీసీ, డైరెక్టర్‌గా ఉన్న వెంకటరెడ్డేనని అన్నారు. డిప్యుటేషన్ మీద రాష్ట్రానికి వచ్చిన వెంకటరెడ్డి, తెలుగుదేశం ఇచ్చిన ఉచిత ఇసుక విధానంలో అవినీతి అని ఫిర్యాదు చేశాడని ఆక్షేపించారు. ఇసుక అక్రమాల్లో తనకు భవిష్యత్తులో శిక్ష తప్పదనే ముందుగా ఓ ఫిర్యాదు పడేసాడన్నారని అన్నారు. గుండె ఆపరేషన్ వంకతో ఇంటినే కార్యాలయంలా మార్చుకున్న వెంకటరెడ్డి రాష్ట్ర సంపదను కొల్లగొడుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక అక్రమాలు, బిల్లుల చెల్లింపులపై ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నాడని మండిపడ్డడారు.
సినీఫక్కీలో ఇసుక లారీని వెంబడించిన మంత్రి ఎస్కార్ట్ వాహనం - ఢీకొట్టడంతో కలకలం
ఇసుక తవ్వకాలపై దొంగ వే బిల్స్ విషయంలో కలెక్టర్ల నుంచి అధికారులంతా బలికావాల్సిందేనని హెచ్చరించారు. గంగా, కావేరి నదులు ఎక్కడ పుట్టాయో తెలియని వాళ్లు సీఐడీ అధికారులుగా ఉండి, తప్పుడు ఫిర్యాదులపై కేసులు కట్టేందుకు సిద్ధంగా ఉంటారని విమర్శించారు. జేపీ వెంచర్స్‌కి ఇచ్చిన ఇసుక ఒప్పందం ముగిసి 6 నెలలు దాటినా ఇంకా అదే సంస్థతో తవ్వకాలు కొనసాగిస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి నెలలోనే హరిత ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు నిషేధించినా, ఆదేశాలు బేఖాతరు చేశారని, చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపకముందు ప్రతీ అక్రమ ఇసుక తవ్వకాన్ని బట్టబయలు చేసినందుకే ఎదురు కేసులు పెట్టారని నక్కాఆనంద్‌బాబు విమర్శించారు.
అక్రమ ఇసుక లారీలను అడ్డుకున్నారనే నెపంతో జనసేన నేతలపై వైసీపీ నేతల మూకుమ్మడి దాడి!
ఇసుక కుంభకోణంలోనే అక్షరాలా 50 వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ రాష్ట్రంలో జేపీ వెంచర్స్‌కి ఇచ్చిన ఒప్పందం కూడా మే 12వ తేదీతో ముగిసింది. మైనింగ్ డైరెక్టుర్ వెంకటరెడ్డి ఎప్పుడు చూసినా మైనింగ్ ఆఫీస్‌లో ఉండడు.. తప్పించుకుని తిరుగుతుంటాడు. ఎందుకంటే ఇప్పుడు జరిగే దోపిడీలో అతను ప్రధాన వాటాదారుడు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని చంద్రబాబుపై కేసు నమోదు చేపిస్తాడు. ఇలా ఎందుకు కంప్లెంట్ ఇస్తాడంటే ఇప్పుడు జరిగే ప్రతీ దోపిడీ వెనుక ఉతని హస్తం ఉంది.- నక్కా ఆనంద్ బాబు, టీడీపీ మాజీ మంత్రి