రాష్ట్రంలో ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం వాటిల్లిందని తెదేపా నాయకుడు కోవెలమూడి రవీంద్ర అన్నారు. గుంటూరులోని గౌతమినగర్లో నిర్వహించిన ఇంటింటికి తెదేపా కార్యక్రమంలో పాల్గొన్న రవీంద్ర మీడియాతో మాట్లాడారు. అన్ని రంగాల వారిని వైకాపా నిర్వీర్యం చేసిందన్నారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలు రోడ్డున పడ్డారని అన్నారు. హుందాగా వ్యవహరించాల్సిన మంత్రులు దిగజారి మాట్లాడం సరికాదన్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చామని వీర్రవీగుతున్న వైకాపా ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఓటుతోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.
ఇదీ చదవండి: ఎన్నికల కమిషనర్ తీరు సరికాదు:ఎంపీ మోపిదేవి వెంకటరమణ