బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని... మాజీమంత్రి జవహర్ మండిపడ్డారు. మంత్రి మోపిదేవి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడంలేదని ఎద్దేవా చేశారు. మండలి రద్దు అయితే మంత్రి పదవి పోతుందనే ప్రస్టేషన్లో ఆయన ఏదేదో మాట్లాడుతూ ప్రజల్లో చులకన అవుతున్నారని విమర్శించారు. శ్రీకాళహస్తి మాడ వీధుల్లో 60 ట్రాక్టర్లతో ర్యాలీ చేయించిన బియ్యపు మధుసూధన్ రెడ్డి ఎవరో తెలియదా అని మంత్రి మోపిదేవిని ప్రశ్నించారు. వైకాపా నేతల నిర్వాకాలపై ఎందుకు మాట్లాడరని జవహర్ నిలదీశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా ఉండబట్టే పాలన దారుణంగా ఉందని జవహర్ ఆక్షేపించారు.
ఇదీ చదవండి