గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలంలో నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను...నరసరావుపేట తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పరిశీలించారు. బొల్లాపల్లి మండలం వెల్లటూరు, పేరూరుపాడు గ్రామాల రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. తుపాను కారణంగా నష్టపోయిన తమను ఏ అధికారులూ పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందారు.
'రైతులను నట్టేట వదిలేశారు'
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్... రైతులను నట్టేట వదిలేశారని ఆంజనేయులు విమర్శించారు. పంట బీమాకు కట్టవలసిన డబ్బును కట్టకుండా, రైతులకు మైక్రో ఇరిగేషన్ , మైక్రో ఇండెంట్లు ఎత్తివేశారని ఆరోపించారు.
'రూ.50వేలు పరిహారం అందించాలి'
వైకాపా ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి... రైతులకు రూ.50వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని, కుళ్లిపోయిన మిర్చినీ, ఇతర పంటలను ప్రభుత్వమే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: