గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం ఉప్పలపాడు గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధమైన ఘటనలో నిరాశ్రుయలైన వారిని తెదేపా నేత జీవీ ఆంజనేయులు ఆదుకున్నారు. విద్యుత్ వైరు తెగి పడి వరుసగా ఉన్నటువంటి 13 పూరిళ్లు అగ్నికి ఆహుతవ్వటంతో... 13 కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డు మీద పడ్డారు. వీరిని చూసి చలించి పోయారు నరసరావుపేట పార్లమెంటు తెదేపా ఇన్ఛార్జ్ జీవీ ఆంజనేయులు. వెంటనే 13 కుటుంబాల వారికి బియ్యం, వంట సామాగ్రి, దుస్తులు, దుప్పట్లుతో పాటు... ఖర్చుల నిమిత్తం ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బాధితులకు ప్రభుత్వం సహాయం అందించి శాశ్వత ఇళ్లను కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు
ఇదీ చదవండీ...: రామతీర్థం పునరుద్దరణకు రూ.3 కోట్లు కేటాయింపు