ETV Bharat / state

DULIPAALLA NARENDRA: 'ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు' - TELUGU NEWS

DULIPAALLA NARENDRA: సీఎం జగన్ గుంటూరులో పర్యటించడం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని తెదేపా సీనియర్ నాయకులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. పింఛన్​లపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

tdp-leader-dhulipalla-narendra-comments-on-cm-jagan-guntur-tour
'ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు'
author img

By

Published : Jan 2, 2022, 2:26 PM IST

'ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు'

DULIPAALLA NARENDRA: రాష్ట్రంలో ప్రజా కంటక పాలన సాగుతోందని తెదేపా సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. సీఎం జగన్ గుంటూరు జిల్లాలో పర్యటించడం వలన ప్రజలకు జరిగిన మేలేమీ లేదన్నారు. సమస్యల కేంద్రంగా ఉన్న జిల్లాను సీఎం అభివృద్ధి చేస్తారని ప్రజలు పడ్డ ఆశ అడియాసగానే మిగిలిపోయిందన్నారు. 2250 రూపాయల పింఛన్​ను 250 రూపాయలు పెంచి ప్రచార ఆర్భాటం చేశారన్నారు. పింఛన్​లను 2 వేల నుంచి 3 వేలు చేస్తామని... నేడు విడతల వారీగా అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ధూళిపాళ్ల మండిపడ్డారు.

ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే 2 కిలో మీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా ఇంత ఎత్తున బారికేడ్లు ఉండవేమో అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాక ఒకలా... వచ్చగా మరోలా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్​ల పైన శ్వేతపత్రం విడుదల చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

MINISTER VELLAMPALLI: మంత్రి వెల్లంపల్లి ఇంటి ఎదుట తెదేపా కార్పొరేటర్ నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.