తెదేపా హయాంలో నిర్మాణమైన టిడ్కో గృహాల లబ్ధిదారులను తొలగిస్తే.. సహించేది లేదని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చదలవాడ అరవిందబాబు అన్నారు. రెండేళ్ల నుంచి అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం లబ్ధిదారులకు ఆ ఇళ్లను అందించడంలో విఫలమైందని ఆరోపించారు.
వైకాపా ఎమ్మెల్యేలు, అధికారులు గతంలోని లబ్ధిదారుల పేర్లను తొలగించి మరొకరికి ఆ ఇళ్లను మంజూరు చేయటం సరికాదన్నారు. ఈ విషయంపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. లేదంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అరవింద బాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి: