ETV Bharat / state

ఎమ్మెల్యే గోపిరెడ్డి కనుసన్నల్లో అక్రమాలు: చదలవాడ - Aravainda Babu comments on Gopireddy

నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తెదేపా నేత చదలవాడ అరవింద ​బాబు తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వైకాపా నేతలకు లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అక్రమాలపై కోటప్పకొండలో ప్రమాణం చేస్తానని... లేదని ఎమ్మెల్యే ప్రమాణం చేయడానికి సిద్ధమేనా అని అరవింద్ బాబు సవాల్ చేశారు.

TDP Leader Aravainda Babu Criticize MLA Gopireddy over Illegal mining and Mafia

author img

By

Published : Feb 17, 2021, 3:50 PM IST

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరసరావుపేటలో కోడెల అభివృద్ధి చేసిన నిర్మాణాలను ధ్వంసం చేశారని... తెదేపా నేత చదలవాడ అరవింద బాబు ఆరోపించారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా గత ప్రభుత్వం చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎక్కడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక, మద్యం, రేషన్ బియ్యం, అక్రమ మైనింగ్ మాఫియాను మాత్రమే అభివృద్ధి చేశారని ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వైకాపా నాయకులకు లేదని అరవింద బాబు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

విశాఖకు సీఎం జగన్.. ఉక్కు కార్మిక సంఘాలతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.