ETV Bharat / state

అచ్చెన్నను విచారణ పేరుతో వేధిస్తున్నారు: జీవీ - మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ వార్తలు

తెదేపా నేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం అనైతికం అని ఆ పార్టీ నేత జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. వైకాపా ఏడాది పాలనంతా కక్ష సాధింపు చర్యలతోనే కొనసాగిందన్నారు. అచ్చెన్నాయుడుని చట్టానికి విరుద్ధంగా విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు.

tdp gv anjaneyulu
tdp gv anjaneyulu
author img

By

Published : Jun 26, 2020, 2:57 PM IST

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అనైతికమని గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు అన్నారు. చట్టానికి విరుద్ధంగా అచ్చెన్నాయుడుని విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలో.. కక్ష సాధింపు చర్యలు తప్ప.. చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు.

మాస్కులు, బ్లీచింగ్ పౌడర్​లలో వైకాపా ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతుందని ఆరోపించారు. దోచుకోవడమే పనిగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. కరోనాని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాలని.. మెరుగైన పాలన అందించాలని జీవీ ఆంజనేయులు సూచించారు.

ఇదీ చదవండి: శ్రీవారి దర్శన టికెట్ల కోసం పోటెత్తిన భక్తులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.