GV ANJENEYULU: దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహంపై దాడి యత్నం ఆంధ్రుల ఆత్మాభిమానంపై దాడి అని నరసరావుపేట పార్లమెంట్ తెదేపా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఈ మేరకు వినుకొండలో మంగళవారం తన నివాసం నుంచి బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం యత్నాన్ని ఖండిస్తూ నిరసన తెలుపుతున్న తనను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలపై దాడులు పెరిగాయని, ఎన్టీఆర్ విగ్రహాలపై కూడా వైకాపా దుండగులు దాడులు చేయడం అమానుషమని అన్నారు. అభివృద్ధి చేయమని ప్రజలు పట్టం కడితే..వైకాపా రాష్ట్రంలో అరాచకాలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం చిన్న విషయమని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెదేపా పాలనలో ఎన్నడైనా వైఎస్సార్ విగ్రహాలపై ఇటువంటి ఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వస్తే వైయస్సార్ విగ్రహల పరిస్థితి ఏమిటో ఆలోచించుకోవాలని జీవీ ఆంజనేయులు హితవు పలికారు.
ఇదీ చదవండి:
CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన