ETV Bharat / state

'వైకాపా అభ్యర్థికి అనుమతిచ్చారు.. నన్ను ఎందుకు అడ్డుకున్నారు' - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు నగరపాలకసంస్థ ఎన్నికల్లో పోలీసులు వైఖరిని తెదేపా అభ్యర్థి బిందు తప్పుబట్టారు. పోలింగ్ కేంద్రంలోకి వైకాపా అభ్యర్థిని అనుమతిచ్చి, తనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

tdp corporator candidate bindu fire on police actions in guntur municipal corporation elections
తెదేపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి బిందు
author img

By

Published : Mar 10, 2021, 9:09 PM IST

గుంటూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లోకి తనను అనుమతించలేదని తెదేపా తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి బిందు ఆరోపించారు. సంజీవయ్య నగర్​లోని మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోనికి వెళ్లేందుకు వైకాపా అభ్యర్థిని అనుమతించిన పోలీసులు.. తనను వెళ్లనీయలేదని, లోపల ఏమి జరుగుతుందో కూడా తనకు తెలియలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు.. పోలింగ్ కేంద్రాల్లోకి అభ్యర్థులు పదే పదే వెళ్తుండడం వల్లే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు.

ఇదీచదవండి.

పురపోరు: అక్కడక్కడ ఘర్షణలు.. పోలీసుల లాఠీఛార్జ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.