జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం తెలియజేశారు. జయప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ జయప్రకాశ్ రెడ్డి అని కొనియాడారు. నాటక, చలన చిత్రరంగానికి ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. తెలుగు నాటకరంగం పెద్దదిక్కును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.
జయప్రకాశ్ రెడ్డి మృతి పట్ల తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో ప్రేక్షుకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: సీనియర్ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఇకలేరు..