TDP Celebrations Across the State After Chandrababu got Bail: తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో (skill development case) భారీ ఉపశమనం లభించింది. హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు ఇప్పటికే మధ్యంతర బెయిల్‌పై ఉండగా.. ఇప్పుడు పూర్తిస్థాయి బెయిల్ మంజూరవడంతో.. ఆయనకు భారీ ఊరట దక్కింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
'చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడం శుభ పరిణామం - నిజం గెలిచింది'
Guntur.. చంద్రబాబుకు బెయిల్ (Chandrababu granted bail) మంజూరుపై మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. అనంతరం నేతలు, కార్యకర్తలు బాణసంచా పేల్చి.. స్వీట్లు పంచుకున్నారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అవినీతి ఆరోపణల్లో ఎలాంటి ఆధారాలు లేకే పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపే యత్నం చేసి దెబ్బతిన్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అవినీతి బురద వేయటం వైసీపీ తరం కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబు పూర్తి స్థాయి కార్యక్రమాలు ఈ నెల 29నుంచి ప్రారంభమవుతాయని.. చంద్రబాబు పులిలా ప్రజల్లోకి వస్తారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే 50 రోజులకు పైగా అన్యాయంగా జైల్లో నిర్బంధించారనే బాధే ఎక్కువగా ఉందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపు మిగిలిన కేసుల్లోనూ బెయిల్ వస్తుందని ఆశిస్తున్నమని నేతలు తెలిపారు.
అక్రమ కేసుల్లో చంద్రబాబును ఇరికించారన్నది హైకోర్టు తీర్పుతో స్పష్టమవుతోంది: ముప్పాళ్ల సుబ్బారావు
Amaravati.. చంద్రబాబుకు బెయిల్ రావడంతో అమరావతి గ్రామల్లో సంబర వాతావరణం కనిపించింది. తుళ్లూరు గ్రంథాలయం కూడలిలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. చంద్రబాబుకి మద్దతుగా నినాదాలు చేశారు. నిజం బయటికి వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన ఏ ఒక్క కేసు కూడా నిలవదని అమరావతి ప్రజలు అన్నారు.
Anantapur.. చంద్రబాబుకు బెయిలు వచ్చిన నేపథ్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ ముందు ఆ పార్టీ వర్గాలు కోలాహలం సృష్టించాయి. కళ్యాణదుర్గం తెదేపా ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి భారీ సంఖ్యలో హాజరైన తెలుగు యువత కార్యకర్తలు నాయకులు ఒకరికొకరు సీట్లు పంచుకొని నృత్యాలు చేసుకుంటూ బాణసంచా పేల్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి సంబరాలు చేసుకున్నారు. న్యాయం గెలిచిందని తమ నేత కడిగిన ముత్యాల బయటికి వస్తాడని ఊహించిందేనని ఈ సందర్భంగా ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు.
'ఎన్నికల వేళ తప్పుడు కేసులు - రాజకీయ పెద్దలు చెప్పినట్లు సీఐడీ నడుస్తోంది'
East Godavari District.. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి దేవి చౌక్ కూడలి వద్ద కేక్ కటింగ్ చేసి నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. అనంతరం తిరుపతి లడ్డు ప్రసాదాన్ని వాహన చోదకులకు ప్రయాణికులకు, కార్యకర్తలకు, నాయకులకు పంచారు. దేవి చౌక్ కూడలి నుంచి గాంధీ విగ్రహం వరకు పాదయాత్రగా 'న్యాయం గెలిచింది' అనే నినాదంతో ర్యాలీ చేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన అనంతరం తిరిగి పాదయాత్రగా దేవిచౌక్ చేరుకుని చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
Parvathipuram Manyam District.. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా పార్వతీపురం టీడీపీ కార్యాలయం వద్ద.. పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గ నాయకులతో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళావెంకట రావు టపాసులు పేల్చారు. చంద్రబాబుకు బైయిల్.. జగన్కు జైలు అంటూ టీడీపీ శ్రేణులు నినదించారు.