అమరావతి కోసం.. గుంటూరులో ఐకాస బైక్ ర్యాలీ - అమరావతిని రాజధానిగా కొనసాగించాలని గుంటూరులో ఐకాస ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో రాజకీయ ఐకాస అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు కోవెలమూడి రవీంద్ర, నసీర్ అహ్మద్, సీపీఐ నేత జంగాల అజయ్ కుమార్ పాల్గొన్నారు. 41 రోజులుగా రైతులు, వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాల నేతలు ఆందోళన చేస్తున్నా... రాజధాని విషయంలో ముఖ్యమంత్రి మొండి వైఖరితో ఉండటం మంచిది కాదని నేతలు హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడే రాజధాని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.