కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ సాయం చేసేందుకు ముందుకురావాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తానా, సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ సహకారంతో గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో కొవిడ్ రోగులకు డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి యాస్మిన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా, సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ ప్రతినిధులను నాగేశ్వరరావు అభినందించారు.
ఇదీ చదవండి: వలస జీవితాలు.. సీలేరు నదిలో గల్లంతు.. ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యం