గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వివాదంలో ఉన్న భూమిని ఆర్మీలో పని చేసిన వ్యక్తికి ఇవ్వలేదని తహసీల్దార్ వెంకటేశ్వర్లు చెప్పారు. భూమి వద్ద అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు పెట్టడంపై షేక్ జిలానీ అనే రైతు మండిపడ్డారు. భూమి తమదేనని.. ఇలా చేయడం అన్యాయమని ఆవేదన చెందుతూ పురుగు మందు డబ్బాతో నిరసనకు దిగారు. ఈ విషయమై తహసీల్దార్ వివరణ ఇచ్చారు. 1978లో గుళ్లపల్లి హిదాయత్, గఫార్ను నిరుపేదలుగా పరిగణించి కేవలం సాగు నిమిత్తం ప్రభుత్వ భూమిని ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆర్ఎస్ఆర్ లోనూ వారి పేర్లు నమోదు చేసిన్నట్లు చెప్పారు. ఆర్మీలో పని చేసిన వారికి ఆ భూమి ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: విజయవాడలో ట్రావెల్స్ బస్సు, వ్యాను ఢీ