ఒంటరిగా ఉన్న వృద్ధుడిని కుటుంబసభ్యులకు అప్పగించి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. జాతీయరహదారిపై ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధుడిని పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చి వివరాలు సేకరించారు. ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి తాడేపల్లిలో వదిలివెళ్లిపోయాడని పోలీసులకు చెప్పారు. తన పేరు సాంబశివరావు అని... కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఉంటానని ఎస్సై బాలకృష్ణకు ఆ పెద్దాయన వివరాలు వెల్లడించారు.
పోలీసులు జగ్గయ్యపేటలోని సాంబశివరావు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. సాంబశివరావును ఎందుకు ఒంటరిగా వదిలిపెట్టారని గట్టిగా ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని వారు పోలీసులకు చెప్పారు. కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం సాంబశివరావును అప్పగించారు.
ఇదీ చదవండి: