ETV Bharat / state

శారదా పీఠంలో ఉత్తరాధికార బాధ్యత స్వీకరణ వేడుక

విశాఖ శారదా పీఠ ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సావాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో ఈనెల 17 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. శిష్యుడు బాలస్వామికి సన్యాస దీక్షను స్వరూపానంద ప్రసాదించనున్నారు.

author img

By

Published : Jun 15, 2019, 10:54 AM IST

Updated : Jun 15, 2019, 11:20 AM IST

deeksha
శారదా పీఠ ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సావాలు

గుంటూరు జిల్లా తాడేపల్లి గణపతి సచ్చిదానంద ఆశ్రమంలో.. విశాఖ శారదా పీఠ ఉత్తరాధికార శిష్య తురియాశ్రమ దీక్ష మహోత్సావాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో... ఈనెల 17 వరకు వేడుకలు జరగనున్నాయి. మొదటి రోజు ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్న బాలస్వామితో.. స్వరూపానంద స్వామి సన్యాసాంగ, దశవిధ స్నానాలు, కూష్మాండా, యాగాలు చేయించారు. అనంతరం సచ్చిదానంద ఆశ్రమంలో ఏర్పాటు చేసిన రాజ శ్యామల అమ్మవారికి.. స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యుడు మల్లాది విష్ణు, విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు, దుర్గగుడి ఆలయ ఈవో కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_14_annavaram_homam_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని క్షేత్ర రక్షకులు గా కొలిచే వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ హోమం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా చండీ హోమం జరిగింది. ఈవో సురేష్ బాబు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Conclusion:
Last Updated : Jun 15, 2019, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.