ETV Bharat / state

SVV School 75th Anniversary: 'ప్రభుత్వ పాఠశాలలంటే చిన్న చూపు వద్దు.. అక్కడ చదివే తాము ఈ స్థాయికి వచ్చాం' - శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల 75 వార్షికోత్సవ వేడుకలు

75th Anniversary of SVV School in Tadikonda: ఏ విభేదాలు లేని సామాజిక ప్రజాస్వామ్యం అవసరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి ప్రభుత్వాలు పని చేయాలన్నారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ ఎస్‌వీవీ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు.

శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల 75 ఏళ్ల వేడుక
SVV School 75th Anniversary
author img

By

Published : Dec 24, 2021, 1:33 PM IST

Updated : Dec 24, 2021, 4:59 PM IST

ఎస్‌వీవీ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవ వేడుకల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు

SVV School 75th Anniversary Celebration at Tadikonda: రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు అమలైనప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండలో నిర్వహించిన శ్రీ వెల్లంకి వెంకటప్పయ్య ఉన్నత పాఠశాల 75 ఏళ్ల వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరైన గోగినేని కనకయ్య విగ్రహాన్ని, పాఠశాల ప్రస్థానాన్ని తెలిపే సావరిన్​ను ఆవిష్కరించారు. పాఠశాల పూర్వ విద్యార్ధులు ఇచ్చిన నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి, తదితరులు పాల్గొన్నారు.

Justice Lavu Nageswara in SVV School 75th Anniversary Celebration: అనంతరం విద్యార్ధులను ఉద్ధేశించి మాట్లాడారు. భారత రాజ్యాంగం సమానత్వానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని.. అలాంటి సమానత్వాన్ని అందరూ ఆచరణలో పెట్టినప్పుడే సామాజికంగా ప్రజాస్వామ్యం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. సంపాదనతో సంతోషం రాదని ఉన్న దానితో సంతృప్తి చెందినప్పుడే సంతోషం వస్తుందని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ పాఠశాలలపై చిన్న చూపు వద్దు..

ప్రభుత్వ పాఠశాలలంటే ఎవరికి చిన్న చూపు వద్దని... తామంతా ప్రభుత్వ బడుల్లో చదివే ఈ స్థాయికి వచ్చామని తెలిపారు. అహం, ఈర్ష్య, ద్వేషాలను పక్కనబెట్టినప్పుడే జీవితంలో పైకి ఎదగగలుగుతారని స్పష్టం చేశారు.

అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పది: జస్టిస్ శేషసాయి

ప్రపంచంలో అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం గొప్పదని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి అన్నారు. ఎవరికైనా చదువు అందిస్తే వారి తరాలన్నీ బాగుపడతాయని తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలు, సంస్కారానికి చదువులో ప్రాధాన్యం ఇవ్వకపోతే అది అసలు చదువే కాదని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి..

థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు.. బొమ్మరిల్లు మినీ థియేటర్ సీజ్!

Last Updated : Dec 24, 2021, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.