AMARAVATI JAC ON SLP NUMBER : రాజధాని అంశంపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు రావటాన్ని అమరావతి ఐకాస నేతలు స్వాగతించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం ఎలాగూ గౌరవించలేదని.. సుప్రీంకోర్టు ఇచ్చేది తుది తీర్పు కావటంతో దానినైనా అమలు చేయాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు కోసం రాజధాని రైతులంతా ఎంతో ఆశాభావంతో ఉన్నారని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌కు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. ఎస్‌ఎల్‌పీ నెంబర్ కేటాయించారు. గత నెలలో దాఖలు చేసిన ప్రభుత్వ పిటిషన్‌కు ఎస్‌ఎల్‌పీ నెంబర్ కేటాయించారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. సుమారు నెల తర్వాత సుప్రీంకోర్టు రిజిస్ట్రీ.. ఎస్‌ఎల్‌పీ నెంబర్ కేటాయించింది. రిజిస్ట్రీకి ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకున్నాక ఎస్‌ఎల్‌పీ నెంబర్ కేటాయింపు జరిగింది. పిటిషన్ విచారణకు తీసుకోవాలని ఇవాళ సీజేఐ ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం.. ప్రత్యేకంగా ప్రస్తావించనుంది. ఈ కేసులో ఇప్పటికే అమరావతి రైతులు.. కేవియెట్లు దాఖలు చేశారు. తమ వాదన కూడా పరిగణలోకి తీసుకోవాలని రైతులు.. కేవియెట్ దాఖలు దాఖలు చేశారు.
ఇదీ జరిగింది: రాష్ట్రానికి అమరావతే రాజధాని అని 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 17న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. 3 రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అమరావతే రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనన్న రాష్ట్ర ప్రభుత్వం తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని కోరింది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనడం సరికాదని సీఆర్డీఏ చట్టం ప్రకారమే చేయాలనడం అసెంబ్లీ అధికారాలను ప్రశ్నించడమేనని పిటిషన్‌లో పేర్కొంది. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే 3 రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపింది. సీఆర్డీఏ ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిందని... అది రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇవీ చదవండి: