SC ON AP GOVT PETITION : విభజన తర్వాత ఆస్తుల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషిన్‌పై విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. ఆస్తుల విభజన సరిగా జరగకపోవడం వల్ల ఆర్థికంగా నష్టపోయామని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఆస్తుల విభజన న్యాయబద్ధంగా జరిపేలా ఆదేశాలివ్వాలని కోరింది. అయితే పిటిషన్‌పై విచారణకు తెలంగాణతో పాటు.. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు హాజరుకాలేదు. వీరికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కౌంటర్‌పై రీజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించిన సుప్రీంకోర్టు..విచారణను వాయిదా వేసింది.
ఇవీ చదవండి: