ETV Bharat / state

వాహనంలో డీజిల్ పోయలేదని ఎస్సై వీరంగం !

డీజిల్ అప్పుగా పొయ్యలేదని ఓ ఎస్సై.. పెట్రోల్ బంక్ వద్ద వీరంగం చేశాడు. బాధ్యత గల వృత్తిలో ఉన్నాడన్న విషయాన్ని మరచి బంక్ సిబ్బందిని దుర్భాషలాడాడు. అక్కడ పనిచేసే కార్మికుడిని చితక బాదాడు.

వాహనంలో డీజిల్ పోయలేదని ఎస్సై వీరంగం !
author img

By

Published : Jun 8, 2019, 5:37 PM IST

వాహనంలో డీజిల్ పోయలేదని ఎస్సై వీరంగం !

బాధ్యత గల వృత్తిలో ఉన్నానన్న విషయాన్ని మరిచాడు ఓ సబ్ ఇన్​స్పెక్టర్. డీజిల్ అప్పుగా పోయ్యలేదని పెట్రోల్ బంకు వద్ద వీరంగం సృష్టించాడు. బంక్​లో పనిచేసే కార్మికుడిపై ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడుతూ చితక బాదాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నిజాంపట్నంలో చోటు చేసుకుంది. ఉదయం పోలీస్ వ్యాన్​లో డీజీల్ కొట్టాలని మండల కేంద్రంలో ఉన్న బంక్ వద్దకు కానిష్టేబుల్ రాగా.. అందులో పనిచేసే కార్మికుడు ఉమానుల్లా తమ యజమానితో మాట్లాడమని చెప్పాడు. వెనుతిరిగిన కానిస్టేబుల్... ఎస్సై రాంబాబుని వెంట తీసుకొని వచ్చాడు. అప్పుగా ఎందుకు డీజిల్ పొయ్యరని ఆగ్రహించిన ఎస్సై.. ఒక్కసారిగా కార్మికుడిపై దాడి చేసి కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లాడు. ఈ దృశ్యాలు బంక్​లో ఉన్న సీసీ కెమరాలో నిక్షిప్తమయ్యాయి. ఎస్సై అనవసరంగా తనపై దాడి చేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. బాధితుడు నిరసన చేపట్టాడు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఇదీచదవండి

'అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలనే లక్ష్యం'

Intro:Ap_Nlr_01_08_Ycp_Sambaraalu_Kiran_Avb_C1

నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి మంత్రి పదవి దక్కడంతో నగరంలో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. నగరంలోని వి.ఆర్.సి. సెంటర్లలో బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి తమ హర్షం వెలిబుచ్చారు. పాదయాత్రలో ప్రకటించినట్లే జగన్ మంత్రివర్గంలో అన్ని వర్గాలకు సమ న్యాయం చేయడం అభినందనీయమని వారు కొనియాడారు. మంత్రి అనిల్ ఆధ్వర్యంలో జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
బైట్: హాజీ, వైసిపి నాయకుడు, నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.