గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ పరిధిలోని పరిధిలో గల పలు మండలాల్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కొవిడ్ కేర్ సెంటర్లను సబ్ కలెక్టర్ మయూరి అశోక్ ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడి రోగులకు అందిస్తున్న సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.
అలాగే వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు గ్రామంలో కొవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ను తనిఖీ చేశారు. అక్కడ కొవిడ్ బాధితులకు అందుతున్న చికిత్స, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులందరికి వెల్కమ్ కిట్స్ ఇచ్చారా అని బాధితులను అడిగి తెలుసుకున్నారు. అలాగే నవరత్నాలు - పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేస్తున్న లే ఔట్లను పరిశీలించారు.
ఇదీ చదవండీ… ప్రధాని మోదీకి అమరావతి రైతుల లేఖ