గుంటూరు జిల్లా పాతబొమ్మువానిపాలెం ప్రాథమికోన్నత పాఠశాల హెడ్మాస్టర్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థులు వరుసగా రెండోరోజు ఆందోళన నిర్వహించారు. పాఠశాల తెరవనీయకుండా పిల్లలు, వారి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. మూడు రోజుల క్రితం ఈ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి పిల్లలు ఆసుపత్రిపాలయ్యారు. దానికి బాధ్యున్ని చేస్తూ ప్రధానోపాధ్యాయులు రామిరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే రామిరెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని.. వెంటనే ఆయన్ను విధుల్లో కొనసాగేలా చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పిల్లలను పాఠశాలకు పంపించమని విద్యార్థుల తల్లిదండ్రులు స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలు చేసిన పొరపాటుకు ఉపాధ్యాయున్ని బలి చేయటం సరికాదని అన్నారు.
ఇదీ చదవండి: రాజధాని రైతులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు