గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో స్థానిక ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అత్యంత పిన్న వయసులో రాజకీయ తీర్థం పుచ్చుకున్న రమావత్ కవిత భాయి (22).. వైకాపా నుంచి 29వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచారు.
చదువుకుంటూ.. మరోపక్క వార్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల కర్మకాండలకు స్థలాన్ని కేటాయించాలని వార్డు ప్రజలు కోరినట్లు ఆమె తెలిపారు. వెంటనే ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఇదీ చదవండి