ETV Bharat / state

ఉపాధ్యాయుడి ఆశ.. విద్యార్థికి 'జీవిత కాలం శిక్ష'!

author img

By

Published : Jun 1, 2020, 4:42 PM IST

ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని ఆశ.. ఓ విద్యార్థి చేతులు విరిగేలా చేసింది. కాస్తంత కక్కుర్తి.. జీవితమంత శిక్షను మిగిల్చింది. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవింద పల్లెలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

student fell down from tree because of a teacher in kurnool district
చేతులు విరిగి మంచానపడ్డ విద్యార్థి మనోజ్​

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లి గ్రామానికి చెందిన ఇంటర్​ విద్యార్థి మనోజ్​... చెట్టుపై నుంచి పడిన ఘటనలో అతని 2 చేతులు విరిగిపోయాయి. 4 రోజుల క్రితం తన గ్రామానికే చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణుడు... మనోజ్​ను పిలిపించుకున్నాడు. చెట్టు ఎక్కి చింతకాయలు కోయాలని కోరాడు. తన పూర్వపు గురువు కావడం వల్ల మనోజ్ ఆయన మాట కాదనలేక చెట్టు ఎక్కి చింతకాయలు కోయడం ప్రారంభించాడు. రెండు గంపల చింతకాయలు జమ చేశాడు.

ఆ తర్వాత చెట్టుపై నుంచి కిందకు దిగే సమయంలో ఎండు కొమ్మపై కాలు పెట్టడం వల్ల.. ఆ కొమ్మ విరిగి నేలపై పడ్డాడు. 15 అడుగుల పైనుంచి పడిన కారణంగా మనోజ్ 2 చేతులు విరిగాయి. ఆ ఉపాధ్యాయుడు మనోజ్​ను.. నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లి చేతులకు కట్టు కట్టించాడు. ప్రస్తుతం మనోజ్ 2 చేతులకు కట్లతో మంచాన పడ్డాడు. ఉపాధ్యాయుడి దురాశతో తమ కుమారుడు ఈ స్థితికి చేరుకున్నాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

తమ కుమారుడికి ఇంకా చికిత్స చేయించాల్సిన అవసరం ఉన్నా.. ఆ ఉపాధ్యాయుడు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. విరిగిన రెండు చేతులు అతుక్కుంటాయో లేదో.. జీవితాంతం ఇలాగే ఉండాల్సి వస్తుందమే అని.. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

ఓ ఇంటి పై ఉపాధ్యాయుడి దౌర్జన్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.