ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో జరిగింది. రాజీవ్ గాంధీ నగర్లో ఉంటున్న విష్ణు ప్రియ పాలిటెక్నిక్ తృతీయ సంవత్సరం చదువుతోంది. తనతో పాటు 10 తరగతి చదువుకున్న మధు నాయక్ అనే యువకుడు, విష్ణు ప్రియ ప్రేమించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పగా.. వారు ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపంతో విష్ణు ప్రియ ఇంటిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు.. విష్ణు ప్రియను జీజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్థరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు అరుండల్‌పేట పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్