ప్రిన్సిపాల్ మందలించాడని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరులో కలకలం రేపింది. నేతాజీనగర్‌కు చెందిన వెంకట సాంబశివరావు పలకలూరు రోడ్డులోని గ్రీన్‌ల్యాండ్ పబ్లిక్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బుధవారం స్కూల్‌కి యూనిఫాం ధరించకుండా వెళ్లిన సాంబశివరావుని... విద్యార్థుల ముందు యునిఫాం ఎందుకు వేసుకురాలేదని ప్రిన్సిపాల్ ప్రశ్నించారు. మనస్తాపానికి గురైన విద్యార్థి తమ ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి శ్రీనివాసరావు కుమారుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు.
మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గుంటూరు శవాగారానికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడు ప్రిన్సిపాల్ వలన ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలోనూ పాఠశాల ఫీజు చెల్లించడంలో ఆలస్యమైనప్పుడు ఇలానే తన కుమారుడిని వేధించాడని చెప్పారు. తన కుమారుడు మృతికి కారణమైన ప్రిన్సిపాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి