మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలు గుంటూరు జిల్లా తెనాలిలో తయారయ్యాయి. సూర్య శిల్పశాలకు చెందిన శిల్పులు వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ విగ్రహాలను రూపొందించారు. వీటి తయారీకి రెండు నెలల సమయం పట్టింది. 8 అడుగుల ఎత్తులో విగ్రహాలను తయారు చేశారు. గతంలోనూ చాలామంది ప్రముఖుల విగ్రహాలను తయారు చేసిన అనుభవం వీరికి ఉంది. తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఈ విగ్రహాలు ప్రతిష్టించనున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ వీటిని ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి.
విదేశీ పక్షుల కిలకిలరావాలకు కేరాఫ్ ఉప్పలపాడు