ETV Bharat / state

ఇనుప వ్యర్థాలతో పునీత్‌ రాజ్‌కుమార్‌ విగ్రహం.. బెంగళూరులో ప్రతిష్ఠ - తెనాలిలో పవర్ స్టార్ విగ్రహం

Statue of Puneeth Rajkumar: ఇనుప వ్యర్థాలతో ప్రముఖ కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ విగ్రహాన్ని తయారు చేసి మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పులు. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల కోరిక మేరకు ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు శిల్పశాల నిర్వాహకులు తెలిపారు.

Statue of Puneeth Rajkumar
పునీత్‌ రాజ్‌కుమార్‌ విగ్రహం
author img

By

Published : Jan 27, 2023, 12:19 PM IST

Statue of Puneeth Rajkumar: ప్రముఖ కన్నడ సినీ నటుడు, దివంగతులు డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ విగ్రహాన్ని తెనాలిలోని సూర్యశిల్పశాలలో తయారు చేశారు. స్క్రాప్ వస్తువులతో ఈ విగ్రహాన్ని తయారు చేయటం విశేషం. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల కోరిక మేరకు ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు సూర్య శిల్ప శాల నిర్వాహకులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీ హర్ష తెలిపారు. ఐరన్ స్క్రాప్ తో విగ్రహాలు తయారు చేయడంలో వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 9 అడుగుల ఎత్తులో, 1.5 టన్నుల ఇనుము ఉపయోగించి నాలుగు నెలలు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు వారు తెలిపారు. బెంగళూరులోని ఒక ప్రధాన కూడలిలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. గతంలో తాము తయారు చేసిన మహాత్మా గాంధీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బాబా సాహెబ్ అంబెద్కర్ స్క్రాప్ విగ్రహాలకు తరహాలో ఈ విగ్రహానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు.

"పునీత్ రాజ్ కుమార్ అభిమానులు ప్రత్యేకంగా చేయమని కోరగా 9 అడుగుల ఎత్తులో, 1.5 టన్నుల ఇనుప వ్యర్థాలతో చేశాము. నాలుగు నెలలు శ్రమించి విగ్రహాన్ని తయారు చేశాము. కర్నాటక రాష్ట్రంలో ప్రతిష్టించిన పునీత్ రాజ్ కుమార్ విగ్రహాలు దాదాపు మేము చేసినవే." - కాటూరి రవిచంద్ర, శిల్పి

ఇనుప వ్యర్థాలతో పునీత్‌ రాజ్‌కుమార్‌ విగ్రహం

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.