ETV Bharat / state

State Wide Agitations on CBN Health: చంద్రబాబు ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల పూజలు.. - CBN Health Devotional Programmes

State Wide Agitations on CBN Health: చంద్రబాబు ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని.. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పూజలు, ప్రార్థనలు చేపట్టాయి. తమ అధినేతను తిరిగి ప్రజల్లో చూడాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

State_Wide_Agitations_on_CBN_Health
State_Wide_Agitations_on_CBN_Health
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 14, 2023, 11:02 PM IST

State Wide Agitations on CBN Health: తెలుగుదేశం అధినేత ఆరోగ్యం మెరుగుపడాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశాయి. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని పార్టీనాయకులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కొనసాగుతూనే ఉంది.

చంద్రబాబు ఆనారోగ్యం నుంచి కోలుకోవాలంటూ పల్నాడుజిల్లా నరసరావుపేట మండలం ఇస్సపాలెంలో టీడీపీ నాయకులు భారీ ఎత్తున పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో సైకో పోవాలి సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. సత్తెనపల్లి రోడ్డులోని బైపాస్ రోడ్డు నుండి ఇస్సపాలెం శ్రీ మహాంకాళీ అమ్మవారి ఆలయం వరకూ పాదయాత్ర నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి టీడీపీ నేతలు పూజలు చేశారు. ఆలయానికి పాదయాత్రగా వెళ్లి.. వెయ్యి టెంకాయలు కొట్టారు. నాదెండ్ల మండలం కనపర్రులోని.. బాలయేసు ఆలయంలో టీడీపీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోట సునీల్‌ ప్రధాన రహదారి నుంచి చర్చి వరకు మోకాళ్లపై నడిచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు.

CBN Family Emotional After Seeing Chandrababu చంద్రబాబును చూసి భావోద్వేగానికి లోనైన భువనేశ్వరి, లోకేశ్..

అనకాపల్లి సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, పాయకరావుపేట చర్చిల్లో టీడీపీ నాయకులు.. మహిళలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందిరా కాలనీలోని చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో మహిళలు, కార్యకర్తలు పాల్గొని చంద్రబాబు క్షేమంగా ఉండాలని.. ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు. బాబుతో మేము అంటూ నినాదాలతో పరిసర ప్రాంతాలను మార్మోగించారు.

TDP Leaders Fire on YSRCP Leaders on CBN Health: చంద్రబాబు ఆరోగ్యంపై వైఎస్సార్సీపీ నేతలు రాక్షసానందం ఏమిటీ..? టీడీపీ నేతల ఫైర్

కొనసీమ జిల్లా ఆలమూరులో నిరసన ర్యాలీ చేసి.. ఇంటింటికీ కరపత్రాలు పంచారు. అంబాజీపేటలో హనుమాన్​ చాలీసా పఠించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని.. జైలు నుంచి బెయిల్​పై విడుదల కావాలని కోరుతూ.. మహిళలు హనుమాన్​ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్షకు టీడీపీ నేతలు సంఘీభావం తెలిపారు.

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని త్రిపురాంతకేశ్వరాలయంలో.. సప్త నారీకేళి ఆయుష్సు పూజ నిర్వహించారు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం వెంకటేశ్వరస్వామి ఆలయంలో.. టీడీపీ నేతలు 101 టెంకాయలు కొట్టారు. కర్నూలులోని సత్యనారాయణ స్వామి ఆలయంలో పార్టీ నేతలు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్‌ తదితరులు ప్రత్యేక పూజలు చేశారు.

TDP Protests about Chandrababu Health Condition: మిన్నంటిన ఆందోళనలు.. చంద్రబాబుకు హాని జరిగితే జగన్‌దే బాధ్యతని హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.