ETV Bharat / state

స్థానిక ఎన్నికల్లో సంస్కరణలు.. మంత్రివర్గంలో నిర్ణయాలు

author img

By

Published : Feb 13, 2020, 7:20 AM IST

15 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలంటూ రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అక్రమార్కులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేలా పలు సవరణలు చేసింది.

ఏపీ మంత్రివర్గ సమావేశం
స్థానిక ఎన్నికలపై చర్చించిన ఏపీ మంత్రివర్గ సమావేశం

స్థానిక ఎన్నికల్లో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలిక ఎన్నికల నిర్వహణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, వీటిలో పోటీచేసే అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రస్తుతమున్న చట్టంలో సవరణలకు ఆమోదం తెలిపింది. నియమావళి ఉల్లంఘించిన అభ్యర్థులకు గతంలో ఉన్న శిక్షలను మార్పులు చేస్తూ, ఇకపై అనర్హత వేటువేసేలా నిర్ణయం తీసుకుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. అనంతరం మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం మేరకు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని మంత్రి తెలిపారు.

మంత్రి వెల్లడించిన వివరాలు...

* గిరిజన ప్రాంతాల్లో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌లుగా ఎస్టీలు మాత్రమే పోటీచేసేలా ఆ స్థానాలను రిజర్వ్‌ చేస్తారు. ఎంపీటీసీలు, వార్డు సభ్యులుగా మాత్రం ఇతరులు పోటీచేసేలా వీలు కల్పిస్తారు.

* ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో పంచాయతీ తీర్మానం లేకుండానే సమస్య అధిగమించేలా... సర్పంచ్‌కు మౌఖిక ఆదేశాలిచ్చే అవకాశం కల్పిస్తారు. తర్వాత ఆ వివరాలు పంచాయతీకి తెలియజేయాల్సి ఉంటుంది.

* గ్రామాల్లో సర్పంచ్‌లు స్థానికంగా నివాసం ఉండేలా నిబంధన తీసుకురానున్నారు. నిత్యం పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలి.

* స్థానిక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలు సర్పంచ్‌లకు అప్పగిస్తారు.

13 నుంచి 15 రోజుల్లో: స్థానిక ఎన్నికల్లో ధన, మద్యం ప్రభావం, అక్రమాలు తగ్గించేందుకు వీలుగా ఎన్నికల ప్రక్రియ 13 నుంచి 15 రోజుల్లోనే ముగిస్తారు. నోటిఫికేషన్‌ జారీ నుంచి పోలింగ్‌ వరకు అంతా పక్షం రోజుల్లోనే పూర్తిచేస్తారు. పంచాయతీ ఎన్నికలు 13 రోజుల్లోనూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను 15 రోజుల్లో నిర్వహిస్తారు. గతంలో ఇవి 20-25రోజుల్లో పూర్తయ్యేవి. ఇకముందు పురపాలిక ఎన్నికలు కూడా పక్షం రోజుల్లోనే పూర్తిచేస్తారు. ఇప్పటివరకు ఇవి సుమారుగా 24 రోజుల్లో పూర్తయ్యేవి. పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి 5 రోజులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 7 రోజులే గడువు ఇవ్వనున్నారు.

గెలిచినా వేటు తప్పదు..: నియమావళి ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో తేలితే ఆయా అభ్యర్థులపై అనర్హత వేటు వేస్తారు. గతంలో ఇలాంటి వారికి 3 నుంచి 6 నెలల వరకు మాత్రమే శిక్ష ఉండేది. ఇకపై అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించడమే కాకుండా గరిష్ఠంగా మూడేళ్ల వరకు శిక్ష పడేలా చూస్తారు. అక్రమాలపై విచారణ జరిగే క్రమంలో, ఎన్నికలు పూర్తయి, అభ్యర్థి గెలుపొందినా, ఆ తర్వాత అతడు అక్రమాలు చేసినట్లు తేలితే అనర్హుడిగా ప్రకటిస్తారు.

ఇవీ చదవండి

ఇక అన్నీ ఎన్నికలే... సిద్ధంగా ఉండండి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.