రాష్ట్ర ప్రభుత్వం, నాయకులు చేస్తున్న ప్రకటనలతో గందరగోళ పరిస్థితి నెలకొందని... బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే... ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేంద్ర బిందువుగా ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల నడుమ... అమరావతి ప్రాంతంలోనే రాజధాని ఉండటం అందరికీ సౌకర్యంగా ఉంటుందన్నారు.
ఇవీ చదవండి...ప్రజాందోళన: గళమెత్తిన అమరావతి మహిళా రైతులు