ETV Bharat / state

భక్తుల కష్టాలు చూసి నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి.. ఎక్కడంటే?

annadana Kendram in Kamareddy district: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అయ్యప్ప భక్తులు భిక్షలేక ఇబ్బందులు పడటం చూసి చలించిపోయిన ఓ వ్యక్తి సదాశివనగర్ 44వ జాతీయ రహదారి వద్ద నిత్యాన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అన్నదాన కేంద్రంలో రోజుకు దాదాపు 300 మంది భోజనం చేస్తున్నారు. అంతే కాకుండా స్థానికంగా నిర్మించే అయ్యప్ప ఆలయానికి శ్రీనివాసరావు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

annadana Kendram in Kamareddy
అయ్యప్ప భక్తులు
author img

By

Published : Dec 10, 2022, 8:42 PM IST

భక్తుల కష్టాలు చూసి నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు చేసిన ఓ వ్యక్తి

annadana Kendram in Kamareddy district: బయట ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఒక్కోసారి సరైన ఆహారం లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటిది మాలధారణలో ఉన్న అయ్యప్ప భక్తులకు భిక్ష దొరకడం చాలా అరుదు. ఒకవేళ భిక్ష దొరకలేదంటే మరుసటి రోజు వరకు ఆకలితో అలమటించాల్సిందే. స్వాముల బాధలను గమనించిన శ్రీనివాసరావు తెలంగాణలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ 44 వ జాతీయ రహదారి వద్ద నిత్యాన్నదాన ఏర్పాట్లు చేశారు. ఈ అన్నదాన కేంద్రం వద్ద నిత్యం దాదాపు 300 మంది దాకా భుజిస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా నిర్మించే అయ్యప్ప ఆలయానికి శ్రీనివాసరావు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు.

"ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం జరుగుతుందంటే స్వామి వారు స్వప్నంలో కనిపించి అభయమిచ్చినట్టుంది. 60 రోజుల అన్నదాన కార్యక్రమానికి శ్రీనివాసరావు శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణం నిమిత్తం ఆయన్ని కలిసినప్పుడు రూ.5 లక్షల 18 వేలు విరాళంగా ఇచ్చారు. అన్నదానానికి కావాల్సిన ఖర్చు మొత్తం ఆయనే విరాళంగా ఇచ్చారు. ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్న ముందుండి నడిపిస్తానన్నారు."- అయ్యప్ప భక్తుడు

"సదాశివనగర్​లో అయ్యప్ప ఆలయం నిర్మాణం నిమిత్తం భక్తులు నన్ను కలవడం జరిగింది. ఆలయ నిర్మాణం చేపట్టండి మా వంతు సహకారం చేస్తాం అని చెప్పాను. కార్తికమాసం అంటేనే అయ్యప్ప మాల ధరించిన భక్తులు మాలలో వేసుకుని కనిపిస్తుంటారు. వారు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరమే కాదు. ఇక నుంచి ప్రతి సంవత్సరం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. దానికి నేనే ఏర్పాట్లు చేయిస్తాను. నేను స్వామి మాల వేసుకున్నప్పుడు అన్నదాన కార్యక్రమం చేయ్యాలని మొక్కుకున్నాను. ఆ కోరికను స్వామి ఇప్పుడు తీర్చారు."- శ్రీనివాసరావు, దాత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.