ETV Bharat / state

ఆట ఆడాలంటే.. డబ్బు కట్టాల్సిందే.. రాష్ట్ర సర్కారు కొత్త రూల్..!

author img

By

Published : Apr 3, 2022, 4:11 PM IST

ఆటలు ఆర్థికంగా భారం కానున్నాయా..? సర్కారు వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నగరాలు, పట్టణాల్లోని క్రీడా మైదానాల్ని ప్రైవేట్‌ సంస్థలకు అద్దెకిచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇకపై అక్కడ ఎవరైనా ఆటలు ఆడాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. "పే అండ్ ప్లే" పేరుతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ తెచ్చిన కొత్త విధానం ఆటగాళ్ల జేబులు ఖాళీ చేయనుంది.

'పే అండ్ ప్లే'తో ఆటగాళ్ల జేబుకు చిల్లు !

'పే అండ్ ప్లే'తో ఆటగాళ్ల జేబుకు చిల్లు

శారీరక ధృడత్వానికి, మానసిక వికాసానికి ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే మన విద్యా విధానంలోనూ ఆటల్ని భాగం చేశారు. యువతలోని ప్రతిభను వెలికి తీసేందుకు.. వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు. దీనికి సంబంధించి.. మౌళిక వసతులు, శిక్షణ బాధ్యతలను ప్రభుత్వం చూస్తుంది. క్రీడా ప్రాధికార సంస్థ-శాప్ ద్వారా ఈ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తుంటారు. అయితే.. ఇకపై ఆటలు ఆడాలంటే పైకం చెల్లించాల్సిన పరిస్థితులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన విధానమే దీనికి కారణం. రాష్ట్రంలో శాప్ ఆధ్వర్యంలోని క్రీడా ప్రాంగణాలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు.

గుంటూరు జిల్లాలో మొదటి విడతలో.. తెనాలి, బాపట్ల, మాచర్లలోని క్రీడా ప్రాంగణాలను ప్రైవేటు వారికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేసి టెండర్లకు పిలిచారు. ఈనెల 7వ తేదిన టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. తెనాలి స్టేడియానికి నెలకు లక్షా 50 వేల రూపాయలు, మాచర్ల, బాపట్ల క్రీడాప్రాంగణాలు నెలకు 75 వేల రూపాయలు చెల్లించి తీసుకోవచ్చని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. క్రీడా సంఘాల ప్రతినిధులు.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పేద, మధ్యతరగతి క్రీడాకారులకు ఇది భారంగా మారుతుందంటున్నారు.

శాప్ మైదానాల్లో నిపుణులైన శిక్షకులు ఉంటారు. ఆటలకు అవసరమైన మౌళిక వసతులు.., క్రీడా సామగ్రి, వ్యాయామశాలు అందుబాటులో ఉంటాయి. వీటికి సంబంధించి నామమాత్రపు ఫీజులే ఉంటాయి. ఇకపై ప్రైవేటు వారి చేతుల్లోకి వెళ్తే.. ఇష్టారాజ్యంగా వసూళ్లు చేసే అవకాశం ఉందని క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శాప్ నిర్వహించే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు కూడా రుసుము చెల్లించాలంటూ ఇటీవలే కొత్త నిబంధన తెచ్చారు. ఒక్కో ఆటకు ఒక్కో ధర నిర్ణయించారు. మొత్తం 19 రకాల ఆటలకు డబ్బులు వసూలు చేయనున్నారు. క్రీడాకారులకు అవసరమైన చేయూత అందించాల్సిన ప్రభుత్వం.. ఇలా ఆటలకు రుసుములు వసూలు చేయటం, క్రీడా మైదానాలు ప్రైవేటువారికివ్వటంపై క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఏడోసారి ప్రపంచకప్​ నెగ్గిన ఆసీస్​.. ఫైనల్లో ఇంగ్లాండ్​ చిత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.