శ్రీ చతుర్ముఖ బ్రహ్మ వంటి అరుదైన దేవాలయాలు చాలా తక్కువగా ఉన్నాయని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. భారతదేశంలో ఎవరి మతాన్ని వాళ్లు విశ్వసిస్తారని చెప్పారు. పురాణాలు నమ్మేవారికి ఈ చారిత్రక దేవాలయాలు నిదర్శనమని వివరించారు.
అనంతరం శ్రీ భూసమేత రంగనాథస్వామి దేవాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, గంగా పార్వతీసమేత నాగేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పాఠశాలలు తెరిచే విషయమై స్పందించారు. కరోనా నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచనలో ఉందని చెప్పారు.
ఇదీ చదవండి: