ETV Bharat / state

'ఎస్సీ, ఎస్టీలపై దాడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం' - Guntur district latest news

ఎస్సీ, ఎస్టీలపై దాడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు. కేసును ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని వివరించారు. ఈ కేసును కొందరు రాజకీయం చేయడానికి యత్నిస్తున్నారన్న ఎస్పీ... నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారని చెప్పారు.

SP Vishal Gunni press meet over Tractor Incident
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌ గున్నీ
author img

By

Published : Aug 4, 2020, 3:38 PM IST

గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌ గున్నీ

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివపురంలో ఘటన దురదృష్టకరమని ఎస్పీ విశాల్‌ గున్నీ విచారం వ్యక్తం చేశారు. మంత్రూబాయిని ట్రాక్టర్‌తో తొక్కించినట్లు సమాచారం వచ్చిందన్న ఎస్పీ... ఆరు గంటల్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. తీసుకున్న అప్పు చెల్లించని కారణంగానే హత్య జరిగిందన్నారు.

పొలం అమ్మి అప్పు తీరుస్తానని మంత్రూబాయి భర్త.. శ్రీనివాసరెడ్డిని కోరారని ఎస్పీ విశాల్ గున్నీ వివరించారు. పొలం తీసుకుని అప్పు పోగా మిగతా డబ్బు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారన్నారు. వినకుండా వారిపైకి ట్రాక్టర్ పోనీయడంతో మంత్రూబాయి చనిపోయిందని వివరించారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్పీ స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఉద్ఘాటించారు. ఈ కేసును కొందరు రాజకీయం చేయడానికి యత్నిస్తున్నారన్న విశాల్ గున్నీ... నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్‌లో విచారించి నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.

ఇదీ చదవండీ... ఆళ్ల రామకృష్ణారెడ్డిపై అన్నిపోలీసు స్టేషన్లలో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.