కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దని ఆంక్షలు విధించలేదని.. ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సంప్రదాయ ప్రభలపై ఆంక్షలు విధించలేదన్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ తిరునాళ్లు జరుపుకోవచ్చని తెలిపారు. మతాచారాలకు సంబంధించి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఎస్పీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రియురాలి కుటుంబ సభ్యుల దాడి.. యువకుడు మృతి