ప్రశాంత ఎన్నికలకు పక్కాగా కార్యాచరణ రూపొందించామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి చెప్పారు. మొదటి దశ పంచాయతీ ఎన్నికలు, నాలుగో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఏర్పాట్లపై సమీక్షించిన ఎస్పీ ... పోలీసు సిబ్బంది నిష్పాక్షికంగా, పారదర్శకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పోలింగ్ నుంచి లెక్కింపు పూర్తయ్యేవరకు శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల్లో నగదు, మద్యం నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టామన్నారు.
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికలకు అంతా సిద్దం!