ETV Bharat / state

కుమారుడికి కరోనా పాజిటివ్.. ఆగిన తండ్రి గుండె

రోజూ ఇంటికి వచ్చి తండ్రిని పలకరించేవాడు. గత నాలుగు రోజులుగా కుమారుడు రాకపోయేసరికి ఆ తండ్రికి అనుమానం వచ్చింది. ఎంతకీ కొడుకు రాకపోయేసరికి కుటుంబసభ్యులను నిలదీశాడు. కుమారుడికి కరోనా అని బంధువులు చెప్పారు. అంతే ఆ మాట వినగానే ఆ తండ్రి గుండె ఆగిపోయింది.

author img

By

Published : Jul 28, 2020, 12:31 AM IST

son corona positive
son corona positive

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం దంతులూరు గ్రామానికి చెందిన వ్యక్తికి మూడు రోజుల క్రితం కరోనా పాజిటివ్​ వచ్చింది. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని అతని తండ్రి లక్ష్మీనారాయణకు తెలియనీయలేదు. 85 ఏళ్ల వయస్సు కావటంతో.. బంధువులు విషయం చెప్పలేదు. అయితే కొడుకు ఇళ్లు సమీపంలోనే ఉండడం.. ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్​గా ప్రకటించటం.. బారికేడ్లు పెట్టడం చూసి లక్ష్మీనారాయణకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులను గట్టిగా అడిగితే విషయం చెప్పారు.

దీంతో లక్ష్మీనారాయణ ఒక్కసారిగా మంచంలోనే కుప్పకూలిపోయారు. బంధువులు 108కి సమాచారం ఇచ్చారు. వాహనం వచ్చి.. అంబులెన్స్ సిబ్బంది పరిక్షించేసరికే లక్ష్మీనారాయణ ఊపిరి ఆగిపోయింది. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. వెంటనే ఆయన మృతదేహానికి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రిలో ఉన్న కుమారుడు మాత్రం తండ్రిని కడసారి చూసుకోలేకపోయారు.

ఇదీ చదవండి: స్వదేశీ 'ఫార్మా'కు జై.. కేంద్రం మార్గదర్శకాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.