భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ నివాసంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. గుంటూరులోని అతని నివాసంలో నీళ్ల మోటారుకు సంబంధించిన స్విచ్ బోర్డు వద్ద షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు లేచాయి. ఇంట్లో పనిచేసేవారు వెంటనే అప్రమత్తమై.. మంటలను ఆర్పివేశారు. ప్రమాదం జరిగిన సమయంలో కన్నా కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న పోలీసులు కన్నా ఇంటికి వచ్చారు. చిన్న ప్రమాదం కావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి: గుంటూరు జిల్లాలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 14 పూరిల్లు