రాజధాని భూముల విషయంలో అక్రమాలకు పాల్పడిన కేసులో విశ్రాంత తహసీల్దార్ సుధీర్ బాబుని నేడు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈరోజు, రేపు సుధీర్ బాబుని అతని న్యాయవాది సమక్షంలో విచారించేందుకు సిట్ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈ కేసులో సుధీర్ బాబుని వారం రోజుల క్రితం అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. సుధీర్ బాబుని విచారించాలని సిట్ అధికారులు ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అతడిని విచారించేందుకు కోర్టు అనుమతించింది. ఇక సుధీర్ బాబు వేసిన బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనుంది.
ఇదీ చూడండి. అదానీ చేతుల్లోకి కృష్ణపట్నం పోర్టు